వృద్ధాశ్రమానికి సరుకులు వితరణ

Feb 11,2024 22:48

ప్రజాశక్తి – పర్చూరు
మండలంలోని నూతలపాడు ఆశ్రయ వృద్ధాశ్రమానికి దాతలు సహకారం అందించారు. అమెరికాకు చెందిన సహృదయ ఫౌండేషన్‌కు చెందిన తాడివాక బిందు వృద్ధాశ్రమానికి రూ.20వేల విలువ చేసే నిత్యవసర సరుకులను వైసిపి నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా ఆదివారం అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగబైరు శ్రీనివాసరావు, కార్యదర్శి పంబీ సదానందరెడ్డి, రాజగోపాలరెడ్డి, పోలూరి శివారెడ్డి, ఆశ్రమ నిర్వాహకులు భవనం శ్రీనివాసరెడ్డి, జయలక్ష్మి, శ్రీసాయి పాల్గొన్నారు.

➡️