చేయూత చెక్కుల పంపిణీ

Mar 17,2024 00:48

ప్రజాశక్తి – పర్చూరు
చేయూత చెక్కులను డ్వాక్రా మహిళలకు స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో వైసిపి ఇన్‌ఛార్జి యడం బాలాజీ శనివారం అందజేశారు. రూ.29కోట్ల ఆరు లక్షలు వారి ఖాతాలకు జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడారు. మాట తప్పని, మడిమ తిప్పని సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా నాలుగు విడతలు ఆసరా నగదును మహిళల ఖాతాలకు జమ చేసి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రూ.18700 చొప్పున 4 విడతల్లో నియోజకవర్గానికి రూ.203కోట్లు జమ చేసినట్లు తెలిపారు. ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే తిరిగి జగన్మోహన్‌రెడ్డిని సిఎంగా గెలిపించాల్సిన బాధ్యత ఉందని వివరించారు. సమావేశం జరుగుతున్న సమయంలో ఇడుపులపాయలో శాసన సభ, పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటన చేయడం, అందులో పర్చూరు అభ్యర్థిగా యడం బాలాజీని ప్రకటించడంతో ఒక్కసారిగా సమావేశంలో సంబరాలు చేసుకున్నారు. అనంతరం తనను గెలిపించి శాసన సభకు పంపించాలని కోరారు. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆరు మండలాల ఎంపీపీలు, జెసిఎస్‌ కన్వీనర్లు, జెడ్పీటీసీలు, వైసిపి మండల కన్వీనర్లు, మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్ళు ఎపిఎం, నాయకులు కొల్లా వెంకటరావు, గాజుల రమేష్, గెరా రవీంద్రనాథ్, గాదే సురేష్, పి రాంబాబు పాల్గొన్నారు.

➡️