ప్రజాశక్తి-అమరావతి : అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇవాళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ వీటి ఏర్పాటుపై సమీక్షించారు. 3 వారాల్లో 100 క్యాంటీన్లు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.వీటి నిర్వహణ మళ్లీ ఇస్కాన్‌కు ఇవ్వాలా? టెండర్లు పిలవాలా? అనే దానిపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇస్కాన్ వాళ్లతో మాట్లాడగా.. తమకే మళ్లీ క్యాంటీన్ల నిర్వాహణ ఇచ్చినట్లైతే, మూడు వారాల్లో 100 క్యాంటీన్లు మాత్రమే ఏర్పాటు చేయగలమని తెలిపారన్నారు. వాళ్లవి సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్నింటిని మూసివేశామని, అక్కడ ఉన్న ఎక్యూప్మెంట్ని వేరే రాష్ట్రాలకి తరలించామని, వాటిని మళ్లీ తీసుకురావాలంటే తమకు కొంచం సమయం పడుతుందని, కనుక గడువులోపల 100 క్యాంటీన్లను ఏర్పాటు చేయగలమని, ఆ తరువాత మరో 15 రోజుల్లో మిగతావి ఏర్పాటు చేస్తామని ఇస్కాన్ తెలిపిందని నారాయణ పేర్కొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/anna-canteen.jpg)