జగనన్న ఇళ్ళ పట్టాలు పంపిణీ

Mar 4,2024 00:16

ప్రజాశక్తి – కారంచేడు
మండలంలోని స్వర్ణ గ్రామంలో జగనన్న కాలనీ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఆదివారం పంపిణీ చేశారు. జగనన్న కాలనీల్లో స్థలం మంజూరైన పేదలకు ఇళ్ల స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేసి అనంతరం పట్టాలు వైసిపి ఇన్‌ఛార్జి యడం బాలాజీ పంపిణీ చేశారు. మండలంలోని 12 సచివాలయాల పరిధిలో 850మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. ఎంపీపీ నీరుకట్టు వాసు బాబు అధ్యక్షత వహించారు. సభలో వైసిపి ఇన్‌ఛార్జి యడం బాలాజీ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వేగవంతంగా రిజిస్ట్రేషన్లు కూడా చేసి పంపిణీ చేయడం శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేర్చడమే సిఎం జగన్‌ లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి యార్లగడ్డ రజిని శ్రీనివాసరావు, సర్పంచులు మధుసూదన్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, కో ఆప్షన్ సభ్యులు ముల్లా నూర్ అహ్మద్, వైసీపీ మండల కన్వీనర్ దండా చౌదరి, జెసిఎస్‌ కన్వీనర్లు పాపారావు, శ్రీకాంత్, పిఎసిఎస్ అధ్యక్షులు ఎర్రం లక్ష్మారెడ్డి, నాయకులు కారుమూడి సుబ్బారెడ్డి, చల్లా సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

➡️