పేదలకు చీరలు పంపిణీ

Dec 27,2023 00:18

ప్రజాశక్తి – వేటపాలెం
క్రిస్టమస్ పండుగ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు పేదలు, వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని పాస్టర్ రెవరెండ్ పి నాని బాబు అన్నారు. మండలంలోని పాపాయిపాలెం సెయింట్ మార్క్ లూదరన్ చర్చిలో చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాపాయిపాలెం గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

➡️