విద్యార్దులకు ట్యాబుల పంపిణీ

Dec 21,2023 02:18

ప్రజాశక్తి – అద్దంకి
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సత్రంబడి పాఠశాల్లో వినికిడి లోపం కలిగిన ఐదుగురు విద్యార్దులకు, ముగ్గురు ఉపాధ్యాయులకు కలిపి 8సాంసగ్‌ ట్యాబులను ఎంఇఒ బూదాటి సుబాకరబాబు అందజేశారు. పాఠశాల హెచ్‌ఎం ఇట్టా రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ఎంఇఒతోపాటు బొమ్మణంపాడు స్కూల్ కాంప్లెక్స్ ఛైర్మన్ చుండి వెంకట శ్రీనివాసమూర్తి మాట్లాడారు. గురకాయపాలెం జెడ్‌పి హై స్కూలు విద్యార్థినిలు షేక్ శుభాన్‌బి, కోవూరి దుర్గ, పందిరి ప్రశాంత్‌కు ఒక్కొక్కటి రూ.37వేల విలువైన ట్యాబులు అందజేశారు. పాఠ్యాంశాలు సులభతరంగా అర్ధమయ్యే విధంగా ప్రత్యేక యాప్‌లను అందులో ఉంచారని తెలిపారు. ట్యాబ్‌ల ద్వారా ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు ఆధునిక సాంకేతికతను అలవర్చుకునే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం డిజిటల్ విద్యను మరింత చేరువ చేస్తుందని తెలిపారు. విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఐఈఆర్టీ ఉపాద్యాయులు కొంగల శ్రీనివాసు, పాలపర్తి యోనా, ఆయా లక్ష్మి పాల్గొన్నారు.

➡️