వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ

Feb 8,2024 00:21

ప్రజాశక్తి – చిన్నగంజాం
గత ప్రభుత్వాలకు భిన్నంగా 99శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి దక్కుతుందని మాజీ ఎంఎల్‌ఎ, వైసిపి పర్చూరు ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. మండల కార్యాలయ ఆవరణలో వరుసగా 4వ విడత వైఎస్ఆర్ ఆసరా పథక లబ్ధిదారులైన డ్వాక్రా మహిళలకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కడవకుదురు ఎంపీటీసీ ఆమంచి సుబ్బారావు, నల్లమోపు సుబ్బారెడ్డి, తిరుపతిరావు, వాటిపల్లి విజమరాంప్రసాద్, వైస్ ఎంపీపీ బాబురావు, రమణారెడ్డి, వెంకరెడ్డి, బాబు, మునిరత్నం, మేడికొండ సునీల్, కుక్కల రమణారెడ్డి, అక్కల చంద్ర, శీను, మోటుపల్లి ఎంపీటీసీ కోడూరి గోవింద్, బలరాం, గొర్లమురి రామకృష్ణ, రావూరి చౌదరి, ఎండిఓ తహశీల్దారు, ఎపిఎం కట్ట అంజిబాబు, ఈఓఆర్డి వేణు పాల్గొన్నారు.

➡️