ఐలవరంలో ఇంటింటి ప్రచారం

Apr 28,2024 01:22 ##tdp #Battiprolu #Anandababu

ప్రజాశక్తి – భట్టిప్రోలు
టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్ధి నక్క ఆనందబాబు, టిడిపి బాపట్ల ఎంపి అభ్యర్ధి కృష్ణప్రసాద్‌ మండలంలోని ఐలవరంలో శనివారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం చేశారు. సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. టిడిపి నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. దళితవాడ నూతన చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో రేపల్లె మాజీ ఎంఎల్‌ఎ బొమ్మనేని వెంకటసుబ్బయ్య, జనసేన ఇన్‌ఛార్జి ఊసా రాజేష్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, మాచర్ల నాగరాజు, దీపాల ప్రసాదు, వామనపల్లి కోటేశ్వరరావు, అనగాని ఏడుకొండలు పాల్గొన్నారు.

➡️