నైపుణ్యాభివృద్ధితోనే ఉపాధి : దేవకుమార్

Dec 19,2023 00:38

ప్రజాశక్తి – చీరాల
దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో యువతకు నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సవాళ్లు అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు స్థానిక ఎన్జీఒ భవనంలో సోమవారం నిర్వహించారు. డిబిఆర్‌సి ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అల్లడి దేవకుమార్ మాట్లాడుతూ నైపుణ్యం అభివృద్ది చేసుకోవడం ద్వారా ఉపాధి సాధించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలపైన అవగాహన పెంచుకోవాలని అన్నారు. డిబిఆర్సి రాష్ట్రంలో పేద, దళిత, గిరిజన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. యువతకు టైలరింగ్, సేంద్రియ వ్యవసాయం తదితర విషయాలపైన విస్తృతంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి కృష్ణకిషోర్ మాట్లాడుతూ స్వయం ఉపాధి కల్పనకు వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా ఫిష్ ఆంధ్ర వంటి పథకాలు ఎలా వినియోగించుకోవాలో తెలిపారు. పరిశ్రమల శాఖ ప్రమోషన్ ఆఫీసర్ టి ఉమాశంకర్ మాట్లాడుతూ పరిశ్రమల శాఖ నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేవ, ఉత్పత్తి రంగాల్లో రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ కో-ఆర్డినేటర్ ఎం హారిక మాట్లాడుతూ ఎపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో టైలరింగ్, ఎలక్ట్రిషన్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా చీరాల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ఈనెల 20నుంచి బ్యాచ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగలవారు 79814 43777 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు. లేదా మహిళా డిగ్రి కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డిబిఆర్‌సి రీజినల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు, ఏరియా కోఆర్డినేటర్లు వి భగవాన్‌దాస్, పి వీరయ్య, ఎం శ్రీలత పాల్గొన్నారు.

➡️