చంద్రబాబు సమక్షంలో టిడిపిలోకి బాచిన

Mar 17,2024 00:50

ప్రజాశక్తి – అద్దంకి
ఉండవల్లిలోని చంద్రబాబు స్వగృహంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ నాయకులు, మాజీ ఎంఎల్‌ఎ బాచిన చెంచు గరటయ్య, ఆయన తనయుడు, శాప్‌నెట్‌ ఛైర్మన్‌ బాచిన కృష్ణ చైతన్య టీడీపీలో చేరారు. టిడిపి కండువా కప్పి సాదరంగా చంద్రబాబు ఆహ్వానించారు. వీరితోపాటు రైతు విభాగం జిల్లా అధ్యక్షులు, బల్లికురవ మండల అధ్యక్షులు చింతల పేరయ్య చౌదరి, పంగులూరు టిడిపి అధ్యక్షులు, వైస్ ఎంపీపీ యర్రం శ్రీనివాసరెడ్డి, సంతమాగులూరు టిడిపి అధ్యక్షులు చింత రామారావు, కొరిశపాడు టిడిపి అధ్యక్షులు రావి శ్రీధర్, పంగులూరు జడ్పీటీసీ రాయిని ప్రమీల సుబ్బారావు, కొరిశపాడు ఎంపీపీ సాధినేని మస్తానరావు, అద్దంకి పట్టణ నాయకులు మాజీ పిఎసిఎస్ చైర్మన్ సంధిరెడ్డి రమేష్, 19 వార్డ్ కౌన్సిలర్ యేజెండ్ల నాగరాజు, అద్దంకి పట్టణం 18వార్డ్ మహిళా నాయకురాలు కావూరి నాగమ్మ, తూర్పు కొప్పెరపాడు సర్పంచ్ యనికపాటి శ్రీను, బొమ్మనంపాడు ఎంపీటీసీ కామేపల్లి హనుమంతరావు, అలవలపాడు సర్పంచ్ షేక్ జక్రయ్య, కశ్యపురం సర్పంచ్ దూళిపాళ్ళ వెంకటరావు, నక్కబొక్కలపాడు సర్పంచ్ దూళిపాళ్ళ బుల్లి రామయ్య, కె రాజుపాలెం సర్పంచ్ అమరనేని రమేష్, ఎంపీటీసీ గుంజి జీవరత్నం, రైతు నాయకులు దీవె రామాంజనేయులు, మాజీ చైర్మన్ చింత శ్రీధర్, మాజీ ఎంపీపీ గోరింట్ల శివాజీ, చందలూరు నాయకులు పెంట్యాల వీరాంజనేయులు, సుధాకర్, గుండపనేని సుబ్బారావు, జనకవరం రావూరి రంగారావు, చిలుకూరి సాంబశివరావు, జాగర్లమూడి సుబ్బారావు, పంగులూరు యువ నాయకులు నాని, చిలుకూరి హరికృష్ణ, అలవలపాడు సీనియర్ నాయకులు మొచ్చు సుబ్బారావు, కాటూరి శ్రీనివాసరావు, మన్నే శ్రీను, మన్నే సిద్దార్థ, మన్నే వేణు, పబ్బ అఖిల్, నీలం నాగేంద్ర, రవి, రాజ్ కుమార్ టిడిపిలో చేరారు.
పంగులూరు : జడ్పిటిసి రాయిని ప్రమీల వెంకట సుబ్బారావు శనివారం టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. మండలంలోని పలువురు నాయకులు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు రావూరి రంగారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు, వైసిపి మాజీ మండల కన్వీనర్ ఎర్రం శ్రీనివాసరెడ్డి, తూర్పు కొప్పెరపాడు సర్పంచ్ ఎనికపాటి కళ్యాణి శ్రీనివాసరావు, అలవలపాడు సర్పంచ్ షేక్ జకరయ్య, కశ్యాపురం సర్పంచ్ దూళిపాళ్ల వెంకటరావు, అలవలపాడు సీనియర్ నాయకులు ముచ్చు సుబ్బారావు, వైసీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ నాయకులు చిలుకూరి సాంబశివరావు తదితరులు టిడిపిలో చేరారు.

➡️