టిడిపిలో చేరిన గరికపాటి మల్లికా

Mar 31,2024 12:15 #Bapatla District

ప్రజాశక్తి-భట్టిప్రోలు : భట్టిప్రోలు మండలం గోరిగిపూడి గ్రామాల సర్పంచ్ గరికపాటి మల్లికా, మాజీ ఎంపీటీసీ గరికపాటి వెంకటేశ్వర్రావు గరికపాటి వెంకటేశ్వర్లు మరియు వారి అనుచరులు 20 కుటుంబాల వారు ఆదివారం వేమూరు టిడిపి అభ్యర్థి నక్క ఆనందబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి ఆనందబాబు టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల్లో టిడిపి గెలుపు లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పని చేద్దామని ఆనందబాబు సూచించారు. టిడిపిలో పనిచేసేందుకు సిద్ధమై వైసీపీని వీడి టిడిపిలో చేరినట్లు వెంకటేశ్వర పేర్కొన్నారు. వైసీపీ ఏర్పడిన నాటినుండి పార్టీలో క్రియ శిలకంగా పనిచేసి స్థానిక శాసనసభ్యులు మంత్రి నాగార్జున ద్వారా నియోజకవర్గంలోని కాక తన గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అంతేకాక వైసీపీ పాలతో విసుకు చెందటమే కాక తీవ్రంగా నష్టపోయినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ పట్ల ఉన్న వెంకటేశ్వరరావును ఇటీవల వేముల వైసీపీ అభ్యర్థి వరకు అశోక్ బాబు బుజ్జగించి తన పార్టీలోకి ఆహ్వానించారు. అయినప్పటికీ వైసిపి వీడి టిడిపిలో చేరటం పట్ల తీవ్ర చర్చనీయాసం అయింది.

➡️