చీరాలలో ఘనంగా గుడ్ ఫ్రైడే

Mar 29,2024 11:57 #Bapatla District

క్రీస్తు యేసు ప్రేమ స్వరూపి

ప్రజాశక్తి-చీరాల: క్రీస్తు యేసు ప్రేమ స్వరూపి అని సర్వపాపాల విముక్తి కోసం ఆయన శిలువలో మరణించి తిరిగి పునరుద్దానుడైయ్యారని సెంట్ ఆంథోనీ చర్చ్ ఫాదర్ ఏసురత్నం అన్నారు. శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా చీరాల పట్టణం మరియమ్మ పేటలోని సెయింట్ ఆందోని చర్చ్ ఆధ్వర్యంలో ఏసుక్రీస్తు సిలువ సన్నివేశాలను ప్రదర్శిస్తూ క్రైస్తవులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యేసు క్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్ధనా మందిరాలలో పాస్టర్లు వాటి అర్థాలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా పట్టణంలోని పలు ప్రార్ధన మందిరాలలో పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు వాక్యపదేశం చేశారు. గుడ్ ఫ్రైడ్ పండుగ సందర్బంగా ఆయా ప్రార్థన మందిరాల్లో క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరైనారు.

➡️