మానవత్వం చాటుకున్న గొట్టిపాటి

Dec 7,2023 23:22

ప్రజాశక్తి – అద్దంకి
ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. పట్టణంలోని పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన సంతమాగులురు వైపు వెళ్తున్న సమయంలో దామావారిపాలెం సమీపంలోని బజాజ్ షోరూం వద్ద రోడ్డుపై ప్రమాదం జరిగి ఉండటాన్ని గమనించారు. ఎమ్మెల్యే వెంటనే కారు ఆపి ఘటనా స్థలికి వెళ్లారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరిని లారీ డీకొనడంతో గాయాలై పడి ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. అప్పటికే ప్రమాదం జరిగి 20నిమిషాలైనా 108అంబులెన్స్ రాలేదని స్థానికులు చెప్పడంతో పరిస్థితి గమనించిన గొట్టిపాటి తన వ్యక్తిగత సిబ్బంది ప్రైవేట్ అంబులెన్స్‌ను పిలిపించి ఆస్పత్రికి తరలించారు. స్ధానిక ప్రభుత్వ వైద్యులతో ఫోనులో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్తితి గురించి అడిగారు. అధిక రక్తస్రావం జరగడంతో ఒకరు చనిపోయారని, మరొకరికి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించనున్నట్లు వైద్యులు ఎమ్మెల్యే కు వివరించారు.

➡️