చేయూత నాలుగవ విడత పంపిణి

Mar 7,2024 22:29

ప్రజాశక్తి -రేపల్లె
ఆడపడుచులను ఆదుకునేందుకు వీలుగా జగనన్న చేయూత పథకానికి శ్రీకారం చుట్టారని వైసిపి ఇంఛార్జి డాక్టర్ గణేష్ అన్నారు. పట్టణంలోని సీతారామ యోగిని కళ్యాణ మండపంలో గురువారం చేయూత చెక్కుల పంపిణీలో ఆయన మాట్లాడారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన మహిళల జీవితాల్లో వెలుగులు నింపడానికి వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. మండల, పట్టణ పరిధిలోని మహిళలకు లక్షల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. పేద మహిళలంతా ఉన్నతంగా ఎదగడానికి సిఎం ఎన్నో అవకాశాలను అమలు చేస్తున్నారని చెప్పారు. సమాజంలో ధైర్యంగా జీవించడానికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. మహిళల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర చరిత్రలో జగన్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. కుల, మత భేదాలు లేకుండా అర్హులైన లబ్దిదారులందరికి పథకాలను అందిస్తున్నారని అన్నారు. మహిళా సాధికారత ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని భావించబట్టే మహిళలకు పెద్ద ఎత్తున మేలు చేసే పధకాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. 45 నుండి 60ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల అభ్యున్నతి కోసం సొంత కుటుంబ సభ్యుని వలె ఏడాదికి రూ.18,750అందిస్తున్నారని అన్నారు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటానికి, స్వయం ఉపాధి కొరకు పాటుపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, విశ్వనాథ్ గుప్తా పాల్గొన్నారు.

➡️