నరేంద్రవర్మను కలిసిన హరనాధరెడ్డి

Feb 25,2024 23:05

ప్రజాశక్తి – బాపట్ల
నియోజకవర్గంలో రాజకీయాల రంగులు మారుతున్నాయి. వైసిపి నాయకులు, ప్రముఖ న్యాయవాది కళ్ళం హరినాధరెడ్డి ఆదివారం టిడిపి అభ్యర్థి వేగేశన నరేంద్రవర్మతో భేటీ అయ్యారు. వీరిద్దరి కలయిక ఆసక్తి కరంగా మారింది. ఇటీవల వైసిపి అభ్యర్ధి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తులకు ఇవ్వాలని ఆయన కోరారు. రఘుపతి అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ వచా్చరు. ఈ నేపధ్యంలో వైసిపి ఆవిర్భావం నుండి వైసిపిలో కొనసాగుతూ వచ్చిన హరినాధరెడ్డి టిడిపి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మతో భేటీ కావడం నియోజకవర్గం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. నరేంద్ర వర్మ నివాసానికి హరినాధరెడ్డి వచ్చి ఆయనను వ్యక్తిగతంగా కలిశారు. ఒకటి, రెండ్రోజుల్లో తమ అనుచరుల అభిప్రాయాలు తీసుకున్న అనంతరం పార్టీ మారే అంశంపై స్పష్టమైన ప్రకటన చేస్తానని ఈ సందర్భంగా హరినాదరెడ్డి తెలిపారు. సుమారు గంటకుపైగా వీరిద్దరి మధ్య సుదీర్ఘ రాజకీయ చర్చ జరిగింది. వీరితోపాటు సీనియర్ టిడిపి నాయకులు కామేపల్లి కృషి బాబు, మొవ్వ లక్ష్మీ సుభాషిణి పాల్గొన్నారు.

➡️