ఇండియన్‌ బ్యాంకు ప్రారంభం

Nov 27,2023 23:33

ప్రజాశక్తి – నగరం
మండలం చినమట్లపూడి గ్రామంలో ఇండియన్ బ్యాంక్ నూతన బ్రాంచిని వైసిపి జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బ్యాకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన బ్యాంక్ సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతల శ్రీకృష్ణయ్య, జడ్పిటిసి నాగమణి, సర్పంచులు షేక్ గుల్జార్, చందోలు దేవదాసు, ఎంపీటీసీ షేక్ జరీన కరీమ్, మాజి ఎంపిపి వాసుదేవరావు, మాజి సర్పంచ్ షేక్ కరిముల్లా, అళ్ళిబుడా పాల్గొన్నారు.

➡️