జయహో బిసి విజయవంతం చేయాలి

Mar 4,2024 00:20

ప్రజాశక్తి – చీరాల
జయహో బిసి ఈనెల 5న మంగళగిరిలో నిర్వహిస్తున్నట్లు టిడిపి ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య తెలిపారు. జయహో బిసి సభ వేదికపై ప్రకటించే బీసీ డిక్లరేషన్ కార్యక్రమంలో వేలాదిగా బిసిలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. స్థానిక టిడిపి కార్యాలయంలో జయహో బీసీ ఆయన ఆదివారం మాట్లాడారు. టిడిపి ప్రభుత్వంలో ఒక్కొక్క బీసీ భవన్ నిర్మాణానికి రూ.5కోట్ల చొప్పున నిధులు ఇచ్చారని తెలిపారు. 1187 మండల కేంద్రాల్లో బీసీ కమిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. బీసీల్లోని అన్ని కులాలకు బడ్జెట్ ఇచ్చి వారి జీవితాలకు భరోసాగా నిలిచినట్లు తెలిపారు. గత ఐదేళ్లుగా జగన్‌రెడ్డి దగా, ద్రోహం చేశారని అన్నారు. బీసీలు ఆర్థికంగా స్థిరపడి ఆత్మగౌరవంతో బతికిన రోజునే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. వృత్తిపరంగా ఎదగాలనుకునే వారికి వృత్తిపరంగా శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధి కోసం కార్పొరేషన్ ద్వారా సబ్సిడీలతో కూడిన రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సెల్ ప్రెసిడెంట్ కౌతరపు జనార్ధన్, నాసిక వీరభద్రయ్య, కావేటి వేణుగోపాల్, గుత్తి వీర ప్రసాదరావు, సాంబయ్య, కారంపూడి పద్మిని, జగదీష్, కోసూరి శ్రీనివాస్, కోటి మోహనకృష్ణ, బందు గురవయ్య, ధోని కనకరాజు, పృధ్వి రామారావు, రావూరి శేషగిరి, మోస హరిబాబు, గోశాల శీను పాల్గొన్నారు.

➡️