బెంగళూరు జట్టుపై ఝార్ఖండ్ జట్టు విజయం

Jan 12,2024 00:04

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని కొండమంజులూరు జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో గత మూడు రోజులుగా కొండ మంజులూరు క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి క్రికెట్ టి20 పోటీలు గురువారం రసవత్తరంగా జరిగాయి. మస్తాన్ లేవెన్ ఝార్ఖండ్, మజ్దూర్ లేవెన్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఝార్ఖండ్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లకు 10వికెట్లు కోల్పోయి191పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 12.5ఓవర్లలో ఆల్ అవుట్ అయ్యి 126పరుగులు చేసింది. బెంగళూరు జట్టుపై ఝార్ఖండ్ జట్టు 65పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లో జార్ఖండ్ జట్టుకు చెందిన అనికోటి డాని 30బంతుల్లో 60పరుగులు, రితీష్ 19బంతుల్లో 35పరుగులు చేసి జట్టు విజయానికి తోడ్పడ్డారు. అదే జట్టుకు చెందిన హరీష్‌రెడ్డి 3ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లు తీశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి ఎంపికయ్యాడు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్, ఎంఎకే క్రికెట్ క్లబ్ బెంగళూరు, ఒంగోలు బుల్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన బెంగళూరు జట్టు నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఒంగోలు బుల్స్ జట్టు 18 ఓవర్లకే ఆల్ అవుట్ అయ్యి 134పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు ఒంగోలు జట్టుపై 121పరుగులు తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టుకు చెందిన ఒక క్రీడాకారుడు సెంచరీ చేయగా, మరొకరు హాఫ్ సెంచరీ చేసి ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించారు. బాలు బాలుకు సిక్స్ లు ఫోర్లు కొడుతూ తాహ అనే క్రీడాకారుడు 47బంతుల్లో104పరుగులు చేసి జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కు ఎంపికయ్యాడు.

➡️