వైసీపీలో చేరిక

Mar 9,2024 23:41

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని అద్దేపల్లి గ్రామంలో ఆరు ఎస్టి, 20ముస్లిం కుటుంబాలు టిడిపి నుండి వైసీపీలో శనివారం చేరారు. వీరికి వైసీపీ ఇన్చార్జి వరికూటి అశోక్ బాబు వైసిపి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న నవరత్న పథకాలకు ఆకర్షితులై టిడిపి నుండి వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పాలన, అభివృద్ధి కొనసాగటానికి మరో సారి జగన్మోహన్‌రెడ్డిని సిఎంను చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బీబీ లలిత కుమారి, జెడ్పిటిసి ఉదయ భాస్కరి, సర్పంచ్ ద్వారా రవికిరణ్మయి, వైసిపి నాయకులు సిరాజుద్దీన్, బండారు శ్రీనివాసరావు, రెహమాన్, చెన్నయ్య, బాలాజీ, మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

➡️