జర్నలిస్ట్ అల్లాబక్షి మృతి

May 23,2024 23:06 ##Bapatla #Jurnalist

ప్రజాశక్తి – బాపట్ల
సీనియర్ జర్నలిస్ట్ అల్లాబక్షి మృతి చెందారు. నాలుగు దశాబ్దాలుగా ఈనాడు దినపత్రికతో పాటు వివిధ పత్రికల్లో ఆయన విలేకరిగా పనిచేశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తుది శ్వాస విడిచారు. పట్టణంలోని ఇస్లాంపేటలో ఆయన నివాసం ఉంటున్నారు. అంత్యక్రియలు శుక్రవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల మాజీ ఎంఎల్‌సి అన్నం సతీష్ ప్రభాకర్, ఎంఎల్‌ఎ కోన రఘుపతి, ప్రెస్ క్లబ్, బాపట్ల జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సంతాపం తెలిపారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

ఎన్టీఆర్‌తో విలేకరి అల్లా బక్షి

➡️