సిపిఎం, జనసేన నాయకుల అరెస్ట్

Feb 2,2024 10:48 #Bapatla District
jsp cpm leaders arrest

ప్రజాశక్తి-చిన్నగంజాం : అక్రమ ఇసుక తవ్వకాలపై జనసేన, సిపిఎం పార్టీల చలో చిన్నగంజాం పిలుపుమేరకు పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు శుక్రవారం తెల్లవారుజాము నుండే అరెస్టుల పరంపర కొనసాగింది. జనసేన రాష్ట్ర నాయకులు పెదపూడి విజయ్ కుమార్ ని వేటపాలెం ఆమంచి స్వాములు కు పోలీసులు పార్టీ వన్ నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. సిపిఎం నాయకులు జి ప్రతాప్ కుమార్, జనసేన నాయకులు సందు శ్రీనివాసరావు, వాసు, గంట వెంకటేష్, తదితరులను అరెస్టు చేసి చిన్నగంజాం పోలీస్ స్టేషన్కు తరలించారు.

➡️