టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షడిగా కరిముల్లా

Dec 3,2023 23:37

ప్రజాశక్తి – మార్టూరు రూరల్
టిడిపి మైనారిటీ సెల్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వలపర్లకు చెందిన సయ్యద్ కరీముల్లా, షేక్ మస్తాన్ వలిని ఎంపిక చేస్తూ టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా మార్టూరుకు చెందిన బాజీవలి, బొబ్బేపల్లి చెందిన నాగూర్ భాష, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వలపర్లకు చెందిన షేక్ మీరావలి మార్టురుకు చెందిన మహమ్మద్ ఇషాక్, పటాన్ జాకీర్, కార్యదర్శులుగా చిమ్మిరిబండకు చెందిన షేక్ మస్తాన్ వలి, ఇసుక దర్శి కి చెందిన షేక్ ఖాసీం వలి, మార్టూరుకు చెందిన షేక్ రహిమ, ఘర్నపూడి పెద్ద ఖరీముల్లా, మౌలాల్, పొన్నూరు సుభాని, నాగరాజుపల్లికి చెందిన అల్లావుద్దీన్, వలపర్లకు చెందిన షేక్ మీరా హుస్సేన్, షేక్ వలి, కోనంకి చెందిన షేక్ చాంద్ నియమితులయ్యారు. నూతన కమిటీ సభ్యులకు ఎంఎల్‌ఎ ఏలూరి సాంభివరావు, మైనార్టీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి షేక్ రజాక్ శుభాకాంక్షలు తెలిపారు.

➡️