హామీలతో మోసం చేయడానికి సిద్ధమా? జగన్‌రెడ్డి : ఎమ్మెల్యే ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్

Mar 28,2024 00:01 ##cmysjagan #gottipatiravi

ప్రజాశక్తి – పంగులూరు
ముప్పవరంలోని టిడిపి కార్యాలయం నందు చక్రాయపాలెం, గోపాలపురం, సింగరకొండపాలెం, కొత్త రెడ్డిపాలెం, చిన్నకొత్తపల్లి, శ్రీనివాస నగర్, శంఖవరప్పాడు, మైలవరం, వెంపరాల గ్రామల్లోని టిడిపి శ్రేణులతో గ్రామాల వారీగా ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు, నాడు పాదయాత్రలో ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ దాదాపు 730కిపైగా హామీలిచ్చారని గుర్తు చేశారు. ఆ హామీల్లో ఎన్ని నెరవేర్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. 730హామీలిచ్చిన జగన్‌రెడ్డి అందులో 85శాతం అంటే 631కిపైగా హామీలు అమలు చేయలేదని, 99శాతం హామీలు అమలు చేశామంటూ సిఎం హోదాలో అబద్దాలు చెప్పడం బాధాకరమని అన్నారు. ఏ ఊరికి ఏ హామీ ఇచ్చారో వాటిని ఎందుకు అమలు చేయలేదో ఆయా ప్రాంతాల ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తామంతా సిద్ధం అంటున్న వారు ఎలా మీరు సిద్ధమో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మరోసారి హామీల పేరుతో మోసం చేయడానికి సిద్ధమా? మరోసారి మాయ చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. మద్య నిషేదం చేసి ఓటు అడుగుతానన్న హామీపై మాట తప్పి మడమ తిప్పడం కాదాని అన్నారు. కరెంటురేట్లు పూర్తిగా తగ్గిస్తానన్న హామీపై ఏమైందని అన్నారు. కరెంటు రేట్లు 9సార్లు పెంచి రూ.64వేల కోట్లు భారం ప్రజలపై వేయలేదాని ప్రశ్నించారు. 2.30లక్షల ఉద్యోగాల భర్తీపై మాట తప్పాడని, మెగా డిఎస్సీని దగా డిఎస్సీ చేశాడని ఆరోపించారు. ప్రతిఏటా జాబ్‌ క్యాలండ్‌ ఇచ్చావాని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హెూదా తెచ్చి ఉద్యోగాల విప్లవం తెస్తానన్న హామీపై ఏమైందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అమలు చేసిన వాటికన్నా మడమ తిప్పిన హామీలే వందల్లో ఉన్నాయని అన్నారు. వీటన్నింటికీ సిఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.

➡️