ఎంపిడిఒ నేతాజీకి ఘన సత్కారం

Jan 27,2024 23:06

ప్రజాశక్తి – వేటపాలెం
ఎంపీడీఒ కొక్కిలిగడ్డ నేతాజీ సేవలు తోటి ఉద్యోగులకు ఆదర్శమని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సమావేశ హాలులో ఎంపీడీఒ కె నేతాజీని శనివారం ఘనంగా సత్కరించారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరు జిల్లాకు వెళ్ళనున్నారు. సహచర ఉద్యోగుల మన్ననలు పొందారని చెప్పారు. తన హోదాను పక్కనపెట్టి సాధారణ మనిషి వలె వ్యవహరించే ఆయన తీరు అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. 2017లో వేటపాలెం ఎంపీడీఒగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇంతవరకు తనకు ఎలాంటి సమస్య ఎదురవ్వకుండా పనిచేశానని నేతాజీ అన్నారు. ఇటీవల జరిగిన రామన్నపేట ఉప ఎన్నికల్లో మాత్రం కొద్దిపాటి ఆందోళనకు గురైనట్లు చెప్పారు. పంచాయతీ కార్యదర్శి బాలిగ సురేంద్ర సహకారంతో ఆ సమస్యను పూర్తిస్థాయిలో అధిగమించినట్లు చెప్పారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ డిఈ స్వర్ణ శేషయ్య, సూపర్నెంట్ ఎంవిఎస్ శర్మ, యుడిసి జయరాజ్, పంచాయితీ కార్యదర్శులు రాజశేఖరరెడ్డి, శివలీల, పూర్ణకుమారి, శారదా, బి రమేష్ బాబు, శ్రీనివాసరావు, బాలిగ సురేంద్ర శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎఈ రామ్ కుమార్, ఎంఇఒ ఎంవి సుబ్బయ్య, వైసీపీ మండల అధ్యక్షుడు బొడ్డుసుబ్బారావు, కొండూరు ఆనందరాజు, జూనియర్ అసిస్టెంట్ నాన్సీ సౌజన్య, దేశాయిపేట పంచాయత గుమస్తా కోటేశ్వరరావు, మాజీ సర్పంచ్ లేళ్ల శ్రీధర్ పాల్గొన్నారు.

➡️