భట్టిప్రోలు తహశీల్దారుగా మునిలక్ష్మి

Mar 2,2024 23:31

ప్రజాశక్తి – భట్టిప్రోలు
నూతన తహశీల్దారుగా ఐ మునిలక్ష్మి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పద్మావతి రేపల్లె ఆర్డీఒ కార్యాలయానికి సీసీగా బదిలీ అయ్యారు. పిట్టలవానిపాలెం తహశీల్దారుగా పనిచేస్తున్న మునిలక్ష్మి బదిలీపై వచ్చారు. తిరుపతి జిల్లా నుండి ఫిబ్రవరి 5న ఎన్నికల బదిలీల్లో భాగంగా పిట్టలవానిపాలెంలో బాధ్యతలు చేపట్టిన ఆమె నెల రోజులు కూడా పూర్తికాకముందే భట్టిప్రోలుకు బదిలీ కావటం తీవ్ర చర్చినియాశం అయ్యింది. డిప్యూటీ తహశీల్దారుగా శ్రీనివాసరావు బాపట్ల కలెక్టర్ కార్యాలయం నుండి బదిలీపై వచ్చి గురువారం బాధ్యతలు చేపట్టారు. నూతన తహశీల్దారు మునిలక్ష్మిని సిబ్బంది స్వాగత సత్కారం చేశారు. అనంతరం సిబ్బంది, వీఆర్వోలు, సర్వేయర్లతో ఆమె సమీక్ష నిర్వహించారు. మండల స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ తనకు సహకరించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసరావు, సర్వేయర్ శ్రీనివాసరావు, వీఆర్వోలు శివరామకృష్ణ, అంబటి ప్రసాద్, వినీత, రత్నాకర్, గ్రేసమ్మ, కంప్యూటర్ ఆపరేటర్లు దరియా, రాజేష్ పాల్గొన్నారు.

➡️