నీలంకు కాంగ్రెస్‌లోకి ఆహ్వానం

Jan 3,2024 23:59

ప్రజాశక్తి – చీరాల
మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేసే దిశగా వివిధ ప్రాంతాలు తిరుగుతున్నారు. కాంగ్రెస్ మాజీ నాయకులను కలుస్తున్నారు. చీరాల ప్రాంతంలోని దళిత క్రైస్తవుల నాయకుడు నీలం శామ్యూల్ మొజేస్ ఇంటికి బుధవారం వచ్చారు. గతంలో కాంగ్రెస్‌లో చురుకైన నాయకులు పార్టీలో చేరటం వలన దళిత క్రైస్తవులు, మైనారిటీలకు అండగా వుంటారని అన్నారు. కాంగ్రెస్‌ బలపడుతుందని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరవలసినదిగా ఆహ్వానించారు. జెడీ శీలం ప్రతిపాదనపై నీలం శ్యాం మాట్లాడుతూ దళిత నాయకులు, దళిత క్రైస్తవులు, తన శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు.

➡️