పార్లమెంట్ సీటు స్థానికులకే ఇవ్వాలి

Jan 6,2024 00:30

ప్రజాశక్తి – బాపట్ల
పార్లమెంటు ఎంపీ సీటును స్థానికులకే కేటాయించాలని బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కన్వీనర్ గుదే రాజారావు డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. కేంద్రం నుండి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.2వందల కోట్లు తీసుకురావడంలో ఎంపీ నందిగం సురేష్ పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి దోహదపడలేదని అన్నారు. స్థానికేతర నాయకులకు సీటును కేటాయించవద్దని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కెఎన్‌పిఎస్‌ జిల్లా కార్యదర్శి కోలా శరత్, దాసరి లక్ష్మి, ఎస్‌కె సుఖీర్, కాగిత వీరయ్య పాల్గొన్నారు.

➡️