వృద్ధాప్య పెన్షన్ అందించిన ఎమ్మెల్యే కరణం

Jan 6,2024 14:47 #Bapatla District
pension distribution

ప్రజాశక్తి-వేటపాలెం : మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శనివారం జరిగిన వైఎస్సార్ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణ మూర్తి మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరుస్తూ వృద్ధాప్య పెన్షన్ ను దేశంలోనే అత్యధికంగా రూ. 3 వేలకు పెంచి ఇస్తున్న వ్యక్తి సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. వాలంటీర్ల ద్వారా దేశంలోనే ఎక్కడా లేని విధంగా గడప వద్దకే పెన్షన్లు పంపిణీ చేయిస్తున్న ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని అన్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన మాట ప్ర‌కారం పెన్షన్ రూ.3 వేలకు పెంచి,నూతన సంవత్సరం అంటే తేదీ మారడం కాదు పేదలు, వృద్దుల జీవితాలు మారాలి. పేదల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి. తమను తాము పోషించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా ఉండరాద‌ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా 66.34 లక్షల మందికి మంచి జరిగేలా పెన్షన్‌, సెలవైనా ఒకటో తేదీనే పెన్షన్‌ అందిస్తున్నారు.  నూతనంగా మంజూరైన పెన్షన్ లతో కలిపి ఒక వేటపాలెం మండలంలోని 11,014 మంది లబ్ధిదారులకు, అక్షరాల 3కోట్ల 5లక్షల 70వేల 500రూపాయలు నేరుగా లబ్ధిదారుడి గడప వద్ద అందించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నేతాజీ, మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు సుబ్బారావు,రామన్నపేట సర్పంచ్ కందేటీ రమణ, ఉప సర్పంచ్ దంతం వెంకట సుబ్బారావు, జెసిఎస్ మండల ఇంచార్జీ లేళ్ల శ్రీధర్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు పులి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు జంగిలి రామారావు,మండల ఉపాధ్యక్షులు అందే కృష్ణ, మండల యువత అధ్యక్షులు ఆవుల అశోక్, జనరల్ సెక్రటరీ పులి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ కట్టా గంగయ్య,మహిళా అధ్యక్షురాలు సీతమహాలక్ష్మి, ఫ్రుద్వి చంద్రమోహన్,పులి హరికృష్ణ,షేక్ ఖాదర్, కర్ణ లక్షరావు, వేటగిరి సంజీవరావు, సాధు రాఘవ, జిడుగు మస్తాన్, జమ్మి ప్రసాద్ రెడ్డి, మారుబోయిన పాపారావు,పులి సోమయ్య, ఆవుల కొండలు, షేక్ హౌలీ, గవిని వెంకట్రావు, చింతలపూడి తులసిరామ్, భాష, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు మరియు గృహసారథులు, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

➡️