సార్వత్రిక సమరానికి సిద్ధం

Feb 18,2024 00:01

ప్రజాశక్తి – చీరాల
రానున్న సార్వత్రిక ఎన్నికల సమరానికి కాంగ్రెస్‌ సిద్దమౌతున్నట్లు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి దేవరపల్లి రంగారావు అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, దేశానికీ రాహుల్ ప్రధాని ఐతేనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు. పట్టణంలోని 8, 9వ వార్డుల ఇన్‌ఛార్జిలను పిసిసి అధ్యక్షురాలు షర్మిల, మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం, జిల్లా అధ్యక్షులు గంట అంజిబాబు ఆదేశాల మేరకు నియమించినట్లు తెలిపారు. ఒకప్పుడు చీరాల నీయోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటని అన్నారు. ప్రస్తుత ఉన్న క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సైన్యాన్ని శక్తి వంచన లేకుండా తయారు చేస్తున్నట్లు చెప్పారు. దేశాభివృద్ధి కాంగ్రస్‌తోనే సాధ్యమని యువత గుర్తెరగాలని కోరారు. ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్ము కుంటుందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షులు పేర్లి బుజ్జిరాజు, కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జూటూరి కుమార్, పట్టణ అధ్యక్షులు బండ్లమూడి విజయ్ కుమార్, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు యర్రాకుల శ్రీనివాసరావు, ఎస్సి సెల్ అధ్యక్షులు దాసి పీటర్ రమేష్ పాల్గొన్నారు.

➡️