అరాచకాలనుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

Feb 24,2024 23:17

– సంతరావూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
– ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
ప్రజాశక్తి – చిన్నగంజాం
తెలుగు జాతి వెలుగు శిఖరం ఎన్‌టిఆర్‌ అని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబులు పేర్కొన్నారు. మండలంలోని సంతరావూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, టిడిపి బాపట్ల ఇన్చార్జి వేగేసిన నరేంద్రవర్మ, టిడిపి చీరాల ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య, జనసేన ఇంచార్జ్ పెద్దపూడి విజయ్ కుమార్, టిడిపి సీనియర్ నేత సలగల రాజశేఖర్ బాబుతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తొలుత గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి భారీ ప్రదర్శనగా ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరుకున్నారు. ప్రజలు అడు గడుగున నీరాజనం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చి ఎన్‌టిఆర్‌ చరిత్ర సృష్టించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రజారంజక పాలన సాగించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు అనేక సంస్కరణలు అమలు చేశారని అన్నారు. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమనే నినాదాన్ని పాటించి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే వైసిపి అరాచక పాలన అంతం కావాలని అన్నారు. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలంటే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. నిస్వార్థ రాజకీయం మాత్రమే రాష్ట్రాన్ని కాపాడుకోగలదని పేర్కొన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం మళ్ళీ ప్రగతి బాట పడుతుందని అన్నారు. రాష్ట్రంలో జనసేన, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అన్నారు. నిరంకుశ రాజకీయం సాగిస్తున్న జగన్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పొద వీరయ్య, మాజీ జెడ్పిటిసి యార్లగడ్డ లక్ష్మి, దేవతోటి నాగరాజు, తెలుగు మహిళా అధ్యక్షురాలు జరుగుల సంధ్య, టిడిపి గ్రామ అధ్యక్షులు ఆతిన సురేష్, విగ్రహ దాత ముద్దన రామకృష్ణ పాల్గొన్నారు.

➡️