విద్యున్నతి ప్రతిభావేతనం జాబితా విడుదల

ప్రజాశక్తి – పంగులూరు
విద్యున్నతి ఫౌండేషన్ ద్వారా ప్రతిభా ఉపకార వేతనాల జాబితాను ఫౌండేషన్ డైరెక్టర్ దూళిపాళ్ల వీరనారాయణ బుధవారం విడుదల చేశారు. జాగర్లమూడివారిపాలెం, ముప్పవరం గ్రామాల మాజీ సర్పంచ్ దూళిపాళ్ల వెంకటేశ్వర్లు, గంగవరం గ్రామానికి చెందిన విశ్రాంత హెచ్‌ఎం బోడెంపూడి రామమూర్తి జ్ఞాపకార్థం ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి 15మంది విద్యార్థులను ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపిక చేసి ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలకు సంబంధించి ఏడాదికి రూ.10వేల చొప్పున ఒక్కో విద్యార్థికి రూ.20వేలు అందిస్తున్నారు. గత ఫిబ్రవరి 11న అద్దంకి, పంగులూరు, ఇంకొల్లు మండలాల్లోని 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించారు. వీరికి 2024 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ చదువుకోవటానికి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. అద్దంకి, బూదవాడ, చందలూరు, పావులూరు, దుద్దుకూరు పాఠశాల నుండి ఇద్దరు చొప్పున, తిమ్మాయపాలెం, చక్రాయపాలెం, దేనువకొండ, పంగులూరు, గంగవరం ఎస్‌వికె ఉన్నత పాఠశాలల నుండి 15మంది విద్యార్థులు ఎంపికైనట్లు చెప్పారు. అద్దంకి మండలం నుండి ఎస్ సాయి చరిష్మా, ఇంకొల్లు మండలం నుండి భూమిశెట్టి గౌతమి, పంగులూరు మండలం బూదవాడ నుండి షేక్ గౌస్ బాషాలు మొదటి స్థానంలో నిలిచినట్లు చెప్పారు. విజేతలకు ఫౌండేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.
అద్దంకి : గత ఫిబ్రవరి 11న విద్యోన్నతి ఫౌండేషన్ ఉపకార వేతనాలకోసం నిర్వహించిన ప్రతిభా పరీక్షల్లో ఎంపికైన విద్యార్ధుల జాబితాను బుధవారం విడుదల చేశారు. అద్దంకి, జె పంగులూరు, ఇంకొల్లు మూడు మండలాలకు సంబంధించి 21ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారు. వీటిలో 10స్కూల్స్ నుండి 15మంది విద్యార్థులను పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. వీరికి జులైలో అడ్మిషన్ పొందిన జూనియర్ కాలేజస్ అథారిటీ పేపర్ తీసుకొని విద్యోన్న ఫౌండేషన్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఆ పేపర్స్ ఇచ్చినట్లయితే నేరుగా విద్యార్ధుల కాతాల్లో రూ.10వేల చొప్పున జమ చేస్తామని ఫౌండేషన్ డైరెక్టర్ దూళిపాళ్ల వీరనారాయణ తెలిపారు. బుద్దిస్ట్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరు బాబురావు మాట్లాడుతూ బ్యాంకు నందు సిన్సియర్ ఆఫీసర్‌గా పనిచేసిన దూళిపాళ్ల వీరనారాయణ శేష జీవితంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలకు ముందుకు రావడం ఎంతో అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, పొడపాటి కృష్ణారావు, కోట వెంకట శ్రీనివాసరావు, తేల హనుమంతరావు పాల్గొన్నారు.

➡️