అరటికీ తీవ్ర నష్టం

Dec 7,2023 00:35

ప్రజాశక్తి – భట్టిప్రోలు
తుఫాన్ కారణంగా కురిసిన వర్షానికి ఈదురు గాలులు తోడవటంతో వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అరటి తోటలు గెల దశలో ఉండగా విరిగిపడిపోవడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. నోటి కాడికి వచ్చిన అరటి గెలలు కంటి ముందే ఇరిగి పడిపోవటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత నాలుగేళ్లుగా ప్రతి ఆట ఏదో రూపంలో ప్రకృతి విపత్తులతో పంటలు నష్ట పోతున్నామని, పరిహారం కూడా అందించటం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

➡️