షర్మిల జిల్లా పర్యటన

Feb 3,2024 23:49

ప్రజాశక్తి – బాపట్ల
పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈనెల 7న జిల్లా పర్యటన జయప్రదం చేయాలని కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి జెడి శీలం కోరారు. స్థానిక కాపు కళ్యాణ మండపంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశానికి చీరాల కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి రంగారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. జెడి శీలం మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. జిల్లాలో జరిగే షర్మిల రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు డి దేవరాజు, పట్టణ అధ్యక్షురాలు రేణుక, రేపల్లె, వేమూరు, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు.

➡️