కారంచేడులో ప్రత్యేక బలగాల కవాతు

Apr 5,2024 15:23 #Bapatla District

ప్రజాశక్తి-కారంచేడు : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యములో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు ఇంకొల్లు సర్కిల్ పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఇంకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ బత్తుల శ్రీనివాసరావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం నాడు సర్కిల్ పరిధిలోని కారంచేడు మండలంలోని స్వర్ణ,కేసవరపాడు, స్వర్ణపాలెం, కొడవలివారిపాలెం,దగ్గుబాడు మరియు తిమిడిదపాడు గ్రామాలలో ప్రత్యేక పొలిసు బృందాలతో కవాతు నిర్వహించారు. సందర్భంగా అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేసారు. చట్ట వ్యతిరేకముగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమములో కారంచేడు పోలీస్ స్టేషన్ సిబ్బంది, ప్రత్యేక పోలీసు బృందం పాల్గొన్నారు.

➡️