పనికి వెళ్తూ ‘కూలీ’న బతుకు

Apr 1,2024 11:32 #Bapatla District

విరిగిన వేరుశనగ జల్లెడ జాతీయ రహదారిపై పడిన కూలీలు
రెండు నిమిషాలలోనే ప్రాణాలు విడిచిన మహిళా కూలీ
ప్రజాశక్తి-వేటపాలెం : వారంతా ఒకే గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు ఎప్పుడు మాదిరి కూలికని ట్రాక్టర్కు అమర్చిన వేరుశనగ జల్లెడపై కూర్చొని ప్రయాణిస్తున్నారు. ట్రాక్టర్ కి అమర్చిన జల్లెడ రేకు ఒక్కసారిగా విరిగిపోవడంతో కూలీలందరూ బైపాస్ రోడ్డుపై తల దిక్కున పడిపోయారు. ఈ ఘటన సోమవారం మండల పరిధిలోని లక్ష్మీపురం వద్ద ఉన్న బండోడు డొంక సమీపంలో అక్కయ్యపాలెం నుండి మూడో కాలువ వద్ద జరిగింది. విరాల్లోనికి వెళితే… మండల పరిధిలోని అక్కయ్యపాలెం గ్రామానికి చెందిన కూలీలు గ్రామంలోనే వేరుశనగ కోత మిషన్ అమర్చి ఉన్న ట్రాక్టర్ వ్యక్తి పాపాయిపాలెం పనికి ఐదుగురు కూలీలు డాక్టర్ కు అమర్చిన వేరుశనగ జల్లెడపై ఎక్కి కూర్చున్నారు. ట్రాక్టర్ 216 జాతీయ రహదారి గుండా వెళుతుండగా లక్ష్మీపురం బండోడు డొంక వద్ద వ్యవసాయ కూలీలు కూర్చొని ఉన్న జల్లెడ ఒక్కసారిగా విరిగిపడిపోయింది దానిమీద కూర్చుని ప్రయాణిస్తున్న కూలీలు తలో దిక్కుకు పడిపోయారు ఈ క్రమంలో నక్కల బుచ్చమ్మ (50)తీవ్ర గాయాల పాలై కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు  విడిచిపెట్టింది. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షేత్రగాత్రులను స్థానికులు కేరళ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వేటపాలెం ఎస్సై జి సురేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఘటన స్థలంలో పంచినామ నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు ప్రమాదానికి దారి తీసిన ఘటన గురించి ఎస్సై సురేష్ సమాచారం సేకరిస్తున్నారు

➡️