సబ్సిడీ కూపన్ కొట్టు.. వెయ్యి పట్టు

May 27,2024 14:36 #Anantapuram District

నార్పల ల్లో హాట్ కేకుల్లా అయిపోయిన సబ్సిడీ విత్తన వేరుశనగ

ప్రజాశక్తి-నార్పల : కూపన్ కొట్టు వెయ్యి పట్టు అన్నచందంగా నార్పల మండలంలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ మారింది అని నార్పల మండల వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే నార్పల మండలంలో ఖరీఫ్ సాగుకు 8542 ఎకరాల సాగు ఆధారితంగా నార్పల మండలానికి కే6 రకం 1900 క్వింటాళ్లు రావడం జరిగిందని క్వింటాల్ పూర్తి ధర 9500 అని సబ్సిడీ 3800 అనగా 40% పొగ రైతు వాటా 5700 చెల్లించాలని ఒక్కొక్క రైతుకు గరిష్టంగా ఒక ఎకరానికి మూడు బస్తాలు 90 కిలోలు ఇవ్వడం జరుగుతుందని ఒక బస్తా ధర 2850 అని రైతు సబ్సిడీ 1140 పోగా ఒక బ్యాగుకు రైతు 1710 చెల్లించాల్సి ఉంటుందని ఇప్పటికే మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేశారు 24వ తేదీ నుండి రైతులకు సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డ్ లో పంపిణీ చేశారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గించాలన్న ఉద్దేశంతో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ చేస్తోంది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో వేరుశనగ కాయలకు డిమాండ్ అధికంగా ఉండడం భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉండడంతో మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది వ్యాప్తంగా 1800 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 1472 మంది రైతులకు శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ గోడౌన్లలో 1375 క్వింటాలు మిగిలిన వారికి శనివారం పంపిణీ చేశారు చేసుకున్న రైతుల్లో మండలంలో ఇంకా అక్కడక్కడ 20 క్వింటాళ్ల వరకు పంపిణీ చేయాల్సి ఉందని ప్రస్తుతం వచ్చిన స్టాక్ అయిపోయిందని రాగానే రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి చెన్న వీరస్వామి తెలిపారు. రైతులకు ఇటీవల వర్షాలు కురిసి పదునెక్కడంతో రైతులు విత్తన కాయల కోసం ఆర్ బి కే కేంద్రాల వద్ద పంట సాగుకు విత్తన కాయల రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతుల పట్టాదారు పాసుపుస్తకం ఆధార్ కార్డు, తీసుకొని వెళ్లి రైతు భరోసా కేంద్రాల్లో వేలిముద్ర వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే రైతు భూమిని బట్టి డబ్బులు కట్టించుకుని కూపన్లను సంబంధిత సిబ్బంది రైతులకు రాసిస్తారని ఆ కూపన్ తీసుకొని వెళ్ళి విత్తన వేరుశెనగ పంపిణీ కేంద్రంలో చూస్తే విత్తన కాయలు ఇస్తారు ఇంతవరకు అంతా బాగానే ఉన్నా నార్పల మండలంలో పలువురు దళారులు రంగప్రవేశం చేసి రైతుల కు మాయ మాటలు చెప్పి కూపన్ ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తామంటూ ఇప్పటికే మండల వ్యాప్తంగా భారీ ఎత్తున సబ్సిడీ విత్తన వేరుశనగ సేకరించారని వేరుసెనగ వ్యాపారులు, మిల్లర్ల తో కుమ్మక్కై ప్రభుత్వం నుండి సబ్సిడీ ధరకు తీసుకున్న వేరుశనగ విత్తన కాయలు నాలుగు ఐదు వేల రూపాయల లాభంతో అమ్ముకుంటున్నారని మండల వ్యాప్తంగా చర్చ జరుగుతోంది దీనిపైన అధికారు లను వివరణ కోరగా రైతుల అమ్ముకుంటుంటే తాము ఏం చేస్తామంటూ అంటున్నారు రైతుల వద్ద కూపన్లు తీసుకొని మధ్యవర్తుల ద్వారా భారీ మొత్తంలో వేరుశనగ విత్తన కాయలను గోడౌన్లో డ0పు చేసి పలువురు వ్యాపారులు దాచిపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని అదేవిధంగా కొందరు వేరుశనగ కాయలు ఆడించి విత్తనాలు నిల్వచేసి తిరిగి వాటిని డిమాండ్ ను బట్టి అధిక ధరలకు అమ్మడానికి కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని. ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు అంత సులువుగా విత్తన కాయలు కూపన్ల చిక్కడం లేదని. నిజమైన రైతులకు అవి కావాలి ఇవి కావాలని రూల్స్ మాట్లాడుతారని లాబీయింగ్ చేసే మధ్యవర్తులకు మాత్రం అలా వెళ్ళగానే కూపన్లు చిక్కుతున్నాయని కూపన్ల కోసం రైతులను వెంటపెట్టుకొని వెళ్తున్న మధ్యవర్తులు విత్తన కాయలు తీసుకునే ప్రదేశంలో ఒక్క రైతు ఉండడం లేదని అంతా వ్యాపారులే వ్యాన్లు, బొలెరోలు పెట్టి విత్తన కాయలు ఎత్తుతున్నారని గోడౌన్ల వద్దకు వెళ్లి చూస్తే రైతులు ఎవరు వ్యాపారులు ఎవరు అన్నది తెలుస్తుందని బహిరంగంగానే పలువురు చర్చించుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇందులోని నిజానిజాలు ఏంటో పూర్తిస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వం రైతులకు అందించే సబ్సిడీ వేరుశనగ కాయలు పక్కదారి పట్టకుండా చూడాలని, పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. నార్పల మండలంలో ఎక్కడైనా సబ్సిడీ విత్తన కాయలు భారీ మొత్తంలో నిల్వ ఉంచారు అన్న సమాచారం ఎవరైనా రైతులు గానీ స్థానికులు గాని తమ దృష్టికి తీసుకుని వస్తే పోలీసుల సహకారంతో అటువంటి గోడౌన్లపై దాడులు చేసి వేరుశనగను స్వాధీనం చేసుకోవడంతో పాటు అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండల వ్యవసాయ అధికారి చెన్న వీరస్వామి తెలిపారు. మలి విడత సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ఎప్పుడు ఉంటుందన్నది అధికారుల నుంచి ఎటువంటి సమాచారం రాలేదని వచ్చిన వెంటనే మండల రైతులకు తెలియజేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి చెన్న వీరస్వామి తెలిపారు.

➡️