పేదల అభివృద్దే వైసీపీ లక్ష్యం

Mar 14,2024 23:42

ప్రజాశక్తి – చీరాల
పేదలందరికి అభివృద్ధి పధకాలు అందిస్తూ వైసీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వైసిపి ఇంచార్జి కరణం వెంకటేష్ బాబు అన్నారు. స్థానిక ఎన్‌ఆర్ అండ్‌ పిఎం ఉన్నత పాఠశాల ఆవరణంలోని ఓఏటిలో గురువారం జరిగిన వైఎస్సార్ చేయూత నాలుగో విడత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ చేయూత ద్వారా నియోజకవర్గంలో 14,175 మందికి రూ.96కోట్లు లబ్ధి జరిగిందని అన్నారు. పేదలకు ఇలాంటి పథకాలు ఇంకా అందాలంటే మరల జగన్మోహన్‌రెడ్డి సిఎం కావాలని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ వైసిపికి మద్దతుగా నిలిచి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కె చక్రవర్తి, ఎంపీడీఒ శోభారాణి, డిఆర్డిఏ పిడి కృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, రాష్ట్ర మహిళ జాయింట్ సెక్రటరీ మల్లెల లలితరాజశేఖర్, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జై సన్ బాబు, వైసిపి మండల అధ్యక్షులు అసాది అంకాలరెడ్డి, బొడ్డు సుబ్బారావు, జిల్లా కార్యదర్శి బండారు శివ పార్వతి, జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు చీమకుర్తి బాలకృష్ణ, ఎస్‌టి సెల్ అధ్యక్షులు నల్లబోతుల రాజ్ కుమార్, ఆర్బికే చైర్మన్ కావూరి రమణరెడ్డి, కౌన్సిలర్స్ కీర్తి వెంకట్రావు, బత్తుల అనిల్, మామిడాల రాములు, మించాల సాంబశివరావు, సీనియర్ నాయకులు నాదెండ్ల కోటేశ్వరరావు, బిట్రా శ్రీనివాసరావు, పృద్వి ధనుంజయ, బుర్ల మురళికృష్ణ, మచ్చా సువార్త, శీలం వేంకటేశ్వరమ్మ, షేక్ మస్తాన్, బక్కా శివ ప్రసాదరెడ్డి, జనరల్ సెక్రటరీ చిలుకోటి శ్రీనివాసరావు, పట్టేం డేవిడ్ మనోహర్, పర్వతనేని శ్రీనివాసరావు, గుంటూరు వెంకట సుబ్బారావు, పాలపర్తి నాగేశ్వరరావు, బక్కా అద్దంకిరెడ్డి, దేవరపల్లి అబ్రహం, మాచర్ల ఆంజనేయులు, బండారు జ్వాల, బుర్ల శివ, బొల్లాపల్లి బెంజిమాన్, ఏపీఎంలు సుబ్బారావు, శ్రీనివాసులు, మెప్మా సిఎంఎం సుబ్రమణ్యం పాల్గొన్నారు.

➡️