కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె

Jan 10,2024 00:34

ప్రజాశక్తి – బాపట్ల
మున్సిపల్ కార్మికులు హక్కుల సాధనకు సమ్మె కొనసాగిస్తున్నారు. సిఐటియు, ఎఐటీయూసీ సంయుక్తంగా మున్సిపల్ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మజుందార్, ఎఐటీయూసీ నాయకులు మాల్యాద్రి పాల్గొన్నారు.


చీరాల : ఆరోగ్యాలను పణంగా పెట్టి వెట్టి చాకిరీ చేస్తున్న మునిసిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వంకు పట్టావాని సిఐటియు సీనియర్ నాయకులు పి కొండయ్య అన్నారు. స్థానిక మునిసిపల్ కార్యాలయం వద్ద కార్మికులు చేస్తున్న సమ్మెలో ఆయన మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుండా ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా జీతాలు పెంచాలని, ఔట్సోర్సింగ్ కార్మికుల పర్మినేంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు సింగయ్య, ఏఐటీయూసీ నాయకులు దాసు, బాబురావు పాల్గొన్నారు.

➡️