తిరుపతి, హైదరాబాద్ జట్ల విజయం

Jan 13,2024 00:46

ప్రజాశక్తి – మెదరమెట్ల
మండలంలోని రావినూతల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ భ్రమరా సంక్రాంతి క్రికెట్ కప్ టోర్నమెంట్లో గురువారం థండర్ బోర్డ్స్ తిరుపతి, ప్రసాద్ స్పోర్ట్స్ హైదరాబాద్ జట్లు విజయం సాధించాయి. ఉదయం జరిగిన మ్యాచ్‌లో థండర్ బోల్స్ తిరుపతి, మెగా వారియర్ విజయవాడ జట్లు తెలపడ్డాయి. తిరుపతి జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదటిగా బ్యాటింగ్ చేసిన మెగా వారియర్ విజయవాడ జట్టు 18.2 ఓవర్లలో కేవలం103 పరుగులను మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. తిరుపతి జట్టులో బౌలర్ ప్రకాష్‌రెడ్డి 4ఓవర్లు బౌలింగ్ చేసి 11పరుగుల మాత్రమే ఇచ్చి ముఖ్యమైన 4వికెట్లను తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన తిరుపతి జట్టు కేవలం 9.2 ఓవర్లలో ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి 108పరుగులు చేసింది. జట్టులో దినేష్ కుమార్ 28బంతులకు 68పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ప్రకాష్‌రెడ్డి ఎన్నికయ్యాడు. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో లైన్స్ క్రికెట్ క్లబ్ బెంగళూరు, ప్రసాద్ స్పోర్ట్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 161పరుగు చేసింది. జట్టులో ఆదిత్యరెడ్డి 58పరుగులు చేశాడు. అనంతరం బెంగళూరు జట్టు బ్యాటింగుకు దిగి 20ఓవర్లో 8 వికెట్లను కోల్పోయి 157పరుగులు చేసి గట్టి పోటీ ఇచ్చింది. తిరుపతి బ్యాట్స్‌ మెన్స్‌లో కౌశిక్, రాకేష్ టెక్కర్ ఇద్దరు అర్థ సెంచరీలు నమోదు చేశారు. అయినప్పటికీ మాచ్‌ను గెలిపించలేక కేవలం 5రన్స్‌తో ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టులో ఆదిత్యరెడ్డిని మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఈ మ్యాచ్లను నిరంతరం ఆర్ఎస్‌సిఎ అధ్యక్షుడైన కారుసాల నాగేశ్వరరావు, వెంకటరావు, నరసింహారావు, ప్రతాప్ తదితరుల అసోసియేషన్ సభ్యుల కనులల్లో మ్యాచ్‌లు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. నేడు మ్యాచ్‌లు ఉదయం శ్రీ సిసి చెన్నై వర్సెస్ వైట్ ఫీల్డ్ అకాడమీ బెంగళూరు జట్లు తెలపడతాయి. మధ్యాహ్నం బ్యాచ్‌లో ఆర్‌వైసిసి లెవెన్ హైదరాబాద్ వర్సెస్ జిఎస్టి సెంట్రల్ ఎక్సైజ్ చెన్నై జట్లు తలపడనున్నాయి.

➡️