స్వేచ్ఛగా ఓటేయాలి

Mar 6,2024 00:08

ప్రజాశక్తి – చీరాల
రానున్న ఎన్నికల్లో ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని డిఎస్పి బేతపూడి ప్రసాద్ అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాతంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. వేటపాలెం మండలం రామాపురంలో చీరాల రూరల్ సీఐ నిమ్మగడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈపురిపాలెం ఎస్‌ఐ శివకుమార్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన గ్రామస్తులతో మంగళవారం మాట్లాడారు. ఎన్నికల నేపద్యంలో నేర నియంత్రణపై అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామస్థులతో సుదీర్ఘంగా మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చట్టాలపై అవగాహన కల్పించారు. ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

➡️