కాంగ్రెస్‌తోనే మైనారిటీల సంక్షేమం

Dec 29,2023 00:15

ప్రజాశక్తి – బాపట్ల
మైనారిటీల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు పఠాన్ రాజేష్ అన్నారు. స్థానిక కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో గురువారం మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మౌజన్, ఇమామ్, ఖాజీలకు నెలకు రూ.12వేలు గౌరవ వేతనం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రూ.4వేల కోట్ల బడ్జెట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. పొరుగు రాష్ట్రం మైనారిటీల సంక్షేమానికి పాటుపడుతుంటే ఇక్కడి సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనారిటీలను నిట్ట నిలువున ముంచారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ముస్లింలకు షాదీ తోఫా రూ.50వేల ఇస్తుంటే తాను అధికారానికి వస్తే షాదీ తోఫా రూ.లక్ష ఇస్తానని హామీలు ఇచ్చి అధికారానికి వచ్చాక మొండి చెయ్యి చూపారని అన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ, రాష్రంలో కాంగ్రెస్ విజయం తద్యమన్నారు. కార్యక్రమంలో తాజు ద్దిన్, నజీర్ హుసేన్, ఆమానుల్లా బేగ్, ముజీబుర్ రెహమాన్, జిలాని, బుజ్జి, కరిముల్లా, నక్కల రాంబాబు పాల్గొన్నారు.


చీరాల : కాంగ్రెస్‌తోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది కాంగ్రెస్ ఇంచార్జ్ దేవరపల్లి రంగారావు అన్నారు. స్థానిక విటల్ నగర్‌లోని చైతన్య మనో వికాస కేంద్రంలో విద్యార్థులకు కాంగ్రెస్ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వీట్ల పంపిణీ చేశారు. కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టాక మత విద్వేషాలు పెరిగాయని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు కార్పోరేటర్లకు కట్టబెడుతుందని అన్నారు. కాంగ్రెస్‌ బలోపేతానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఆయన వెంట పాస్టర్ రమేష్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.

➡️