మైనార్టీలకు ద్రోహం చేసిన వైసిపీ

Dec 2,2023 00:28

ప్రజాశక్తి – కర్లపాలెం
వైసిపీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం, మైనార్టీలకు ద్రోహం చేసిందని టిడిపి ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆరోపించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో పెరలి గ్రామానికి చెందిన 29మంది వైసిపి నాయకులు, కార్యకర్తలు వైసీపీపై ఆసహనంతో టిడిపి విధానాలు నచ్చి నరేంద్రవర్మ, టిడిపి, జనసేన నాయకుల సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్నారు. చేయని తప్పుకు చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి 52రోజులు జైల్లో పెట్టారని అన్నారు. పేరలి గ్రామానికి చెందిన ముస్లిం, మైనారిటీలు టిడిపిలో చేరడం శుభ పరిణామమని అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీ సోదరుల బిడ్డలకు సాదిక్ ముబారక్ పథకం కింద రూ.50వేల ఆర్థిక సాయం అందజేసేవారని అన్నారు. రంజాన్ పండుగను పేద, ధనిక తేడా లేకుండా సంతోషకరంగా చేసుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా ఇచ్చేవారని అన్నారు. వైసిపి అరాచక ప్రభుత్వం అవన్నీ రద్దు చేసిందని అన్నారు. హజ్‌ యాత్రకు వెళ్లాలనుకున్న ముస్లిం సోదరీ, సోదరులకు టిడిపి ప్రభుత్వం సహాయ, సహకారాలు అందించారని అన్నారు. ముస్లిం సోదరులకు టిడిపి అన్ని విధాలుగా అండగా నిలబడిందని అన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ ఏపూరి భూపతిరావు, పార్లమెంటు ఉపాధ్యక్షులు నక్కల వెంకటస్వామి, మాజీ ఎంపిటిసి షేక్ బాజీ పాల్గొన్నారు.


పంగులూరు : టిడిపితోనే అభివృద్ది, సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని బూదవాడ గ్రామంలో బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి మహిళలు, యువతతో మాట్లాడారు. సమస్యలు తెలుసుకున్నారు. టిడిపి అధికారంలోకి వస్తే అమలు చేయబోయే సంక్షేమ పథకాలు మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికీ నీరు, పూర్ టు రిచ్, బీసీ రక్షణ చట్టం గురించి వివరించారు. జగన్ రెడ్డిలా అప్పులతో కాకుండా పరిశ్రమలు స్థాపించి సంక్షేమం, అభివృద్ధి రెండు చంద్రబాబు ముందుకు తీసుకు వెళ్తారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ డైరీ ఛైర్మన్‌ బాలిన రామసుబ్బారావు, మాజీ జెడ్‌పిటిసి కరి వెంకటసుబ్బారావు, టిడిపి నాయకులు కుక్కపల్లి ఏడుకొండలు, గుర్రం ఆదిశేకర్, గొట్టిపాటి కాజా స్వామి, చింతల సహదేవుడు, కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, వలపర్ల సుబ్బారావు, దశరథ, ఆరికట్లవారిపాలెం మాజీ సర్పంచ్ ఉన్నం రవి, పిచ్చిరెడ్డి, గుదిబండ్ల ఆదిరెడ్డి పాల్గొన్నారు.


చీరాల : టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని టిడిపి ఇన్చార్జి ఎం ఎం కొండయ్య అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం 1వ వార్డులో శుక్రవారం నిర్వహించారు. ఇంటికి వెళ్లి టిడిపి అమలు చేయబోయే పథకాల వివరాలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో యువ నాయకులు ఎం గౌరీ అమర్నాథ్, అనపర్తి వనజ, అనపర్తి రత్నబాబు, ఉసురుపాటి సురేష్, గంజి పురుషోత్తం, నరాల తిరుపతి రాయుడు, పావులూరి రవీంద్ర, నందం లావణ్య, పడవల లలిత, అవ్వారు శివకుమారి, కూరపాటి వరలక్ష్మి, ఆకురాతి సుజాత పాల్గొన్నారు.


బాపట్ల : ఆర్థికంగా నిరుపేదలు ఎదగాలన్నదే టిడిపి లక్ష్యమని టిడిపి ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. పట్టణంలో 8వవార్డు మల్లికార్జున బృందావనంలో ప్రతి ఇంటికి టిడిపి కార్యక్రమం నిర్వహించారు. నిజాయితీగా ప్రజాసేవ చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. చంద్రన్న హయాంలో ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా, దుల్హన్, ఉచిత ఇసుక, చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, మరెన్నో ప్రజా సంక్షేమ పథకాలను వైసిపి ప్రభుత్వం రాజకీయరక్షతోనే రద్దు చేశారని అన్నారు. వాటిని పునరుద్ధరించేందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ నాయకులు గొలపల శ్రీనివాసరావు, ఫరీద్ మస్తాన్, కొల్లూరి వెంకట్రావు, నక్కల వెంకటస్వామి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, ధార అశోక్, హనుమాన్ జి, దమ్మాలపాటి రాఘవేంద్రరావు, వీరాంజనేయులు, సంజయ్ గాంధీ, వెంకటేష్, ఏసోబు, కిరణ్, దుర్గారావు, వెంకటేష్, సాంబయ్య, మర్రిపల్లి నాగరాజు, రుక్మిణి పాల్గొన్నారు.

భట్టిప్రోలు : మండలంలోని ఐలవరం గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో బాబు షూటి, భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. బాబు షూరిటీ పత్రాలపై నమోదు చేయించారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలని కోరారు. చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టో ప్రకారం అధికారంలోకి రాగానే అన్ని అంశాలు అమలు చేస్తారని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కోమనపల్లి కోటేశ్వరరావు, మాచర్ల నాగరాజు, దీపాల ప్రసాద్, అనగాని ఏడుకొండలు, జగ్గారపు పాపారావు పాల్గొన్నారు.

➡️