అవకాశమిస్తే అభివృద్ధి చేస్తా : బేబినాయన

Apr 7,2024 21:24

ప్రజాశక్తి- బొబ్బిలి : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. పట్టణంలోని 16వ వార్డులో ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. రానున్న ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయనతో జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, బాబు పాలూరి, టిడిపి పట్టణ అద్యక్షులు ఆర్‌.శరత్‌, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, జనసైనికులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.టిడిపిలో 250 కుటుంబాలు చేరికరామభద్రపురం మండలం ఆరికతోట, జగన్నాధపురం నుంచి 250 కుటుంబాలు వైసిపిని వీటి టిడిపి తీర్థం పుచ్చుకున్నాయి. వీరంతా కోటకు చేరుకుని టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన సమక్షంలో టిడిపిలో చేరారు. అభివృద్ధిలో వైసిపి విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాబు పాలూరి, రామభద్రపురం మండల నాయకుల ఎం.తిరుపతిరావు, చింతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బిసిలకు కొత్తవలస: రాష్ట్రంలో బిసిలకు పెద్దపేట వేసిన ఘనత టిడిపిదేనని ఎస్‌ కోట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి అన్నారు. మండలంలోని రాజపాత్రునిపాలెంలో ఆదివారం టిడిపి జయహో బిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోళ్ల లలిత కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అధికారం వచ్చిన వెంటనే బిసిలకు న్యాయం జరుగుతుందన్నారు. గత 40 సంవత్సరాలుగా బిసిలు పార్టీకి అండగా ఉంటున్నారని, ఎన్‌టిఆర్‌ పార్టీని బిసిల కోసమే పెట్టారని గుర్తు చేశారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. చడం జరిగింది. బొబ్బిలి అప్పారావు (మాస్టర్‌), కోళ్ల శ్రీను, లెంక శ్రీను ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్‌, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️