బస్సుకు తప్పిన పెనుప్రమాదం

Feb 20,2024 11:42 #Big accident, #East Godavari, #RTC BUS

నల్లజర్ల చెక్‌పోస్టు (తూర్పు గోదావరి) : ఒడిశా రాష్ట్రం నబరంపూర్‌ నుండి విజయవాడకు వెళుతున్న ఆర్టీసీ బస్సు నల్లజర్ల చెక్‌ పోస్ట్‌ దగ్గర మంగళవారం తెల్లవారుజామున 5:15 నిమిషాల సమయంలో రోడ్డు డివైడర్‌ ఎక్కి అక్కడనుండి అదుపుతప్పి కుడివైపున సుమారు 200 గజాలు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభం ఇతర ప్రైవేట్‌ ఎలక్ట్రికల్‌ బోర్డులను ధ్వంసం చేసుకుంటూ మరో మోటార్‌ బైక్‌ ను ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందున్న చక్రం పంక్చర్‌ అయ్యింది. విద్యుత్తు స్తంభం విరిగిపోవడంతో వైర్లు తెగి బస్సుపై పడినప్పటికీ బస్సు రన్నింగ్‌ లో ఉండటంతో వెంటనే వైర్లు కింద పడిపోయి పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు కండక్టర్‌ మహంతి తెలిపారు. విద్యుత్‌ అధికారులు వచ్చి కింద పడ్డ వైర్లకు విద్యుత్‌ ప్రసరణ కాకుండా ఆపారు. నిత్యం వందలాదిమంది తిరిగే రోడ్డులో పగలైతే భారీ ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు అంటున్నారు.

➡️