ఇండియా’ అభ్యర్థులను గెలిపించాలని బైక్‌ ర్యాలీ

ఇండియా బ్లాక్‌

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌ :ఇండియా బ్లాక్‌ తరుపున పోటీ చేస్తున్న పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ గురువారం కంచరపాలెంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు.విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్‌, సిపిఎం, ఆమ్‌ ఆద్మీ తదితర ఇండియా బ్లాక్‌ పార్టీలు, భారత్‌ బచావోతో పాటు పలు ప్రజాసంఘాలు బలపరచిన సిపిఐ అభ్యర్థి అత్తిలి విమలకు కంకి కొడవలి గుర్తుపైనా, విశాఖ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పి.సత్యారెడిడకి హస్తం గుర్తుపై ఇవిఎంలో సీరియల్‌ నెంబరు నాలుగులో ఉన్న గుర్తులపై బటన్‌ నొక్కి, ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కంచరపాలెం మెట్టు వద్ద ప్రారంభమైన ర్యాలీలో సిపిఐ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి అత్తిలి విమల, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.చంద్రశేఖర్‌, జిఎస్‌.జె అచ్యుతరావు, ఎం.మన్మధరావు, ఎస్‌.కె రెహమాన్‌, క్షేత్రపాల్‌, నాయకులు నల్లయ్య, నాగభూషణం, ఆదినారాయణ, పైలా ఈశ్వరరావు, గురుబాబు, ఎండి బేగం పాల్గొన్నారు.

బైక్‌ ర్యాలీలో పాల్గొన్న సిపిఐ అభ్యర్థి విమల, ఇండియా బ్లాక్‌ అభ్యర్థులు’

➡️