జిప్సా అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

గాజువాక పారిశ్రామిక ప్రాంత ప్రైవేట్‌ పాఠశాలల సంఘం

ప్రజాశక్తి -గాజువాక : గాజువాక పారిశ్రామిక ప్రాంత ప్రైవేట్‌ పాఠశాలల సంఘం(జిప్సా) అధ్యక్షుడు పాలవలస భాస్కరరావు జన్మదిన వేడుకలను చట్టివానిపాలెం భాస్కర్‌ విద్యానికేతన్‌ పాఠశాలలో జిప్సా సభ్యులు సమక్షంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా భాస్కరరావుకు జిప్సా సంఘ సభ్యులు పుష్పగుచ్ఛాలు అందింయిచ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జిప్సా ప్రధాన కార్యదర్శి గిరీష్‌ శ్రీనివాస్‌, కోశాధికారి డి శ్రీనివాసరావు, అప్సా రాష్ట్ర నాయకులు పొన్నాడ వాసుదేవరావు, మరిశర్ల సత్యనారాయణ, జిప్సా నాయకులు పి మురళీసుందర్‌, చంద్రమౌళి, రవికుమార్‌, వెంకు నాయుడు, రాము పాల్గొన్నారు.

భాస్కరరావును సత్కరిస్తున్న జిప్సా ప్రతినిధులు

➡️