ప్రజలను మభ్యపెట్టేందుకు బిజెపి కుట్ర

ప్రజాశక్తి – కడప అర్బన్‌ దేశంలో మతోన్మాద బిజెపి ప్రజలను మళ్లీ మభ్య పెట్టేందుకు మేనిఫెస్టో విడుదల చేసిందన్నారు. అందులో ఎక్కడ రైతులకు, యువ కులకు, నిరుద్యోగ యువకులకు ఉప యోగపడేలా లేదన్నారు. కానీ నరేంద్ర మోడీ మాత్రం ఈ మేనిఫెస్టో భావి తరాలకు ఉపయోగపడేలా తయారు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసి వివిధ రంగాలపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అవగాహన చేసుకుని ఉద్యమాలు చేసే వారందరితో చర్చించి ఈ ఎన్నికల మేనిఫెస్టోను తయారు చేశామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులేసు తెలిపారు. ఆదివారం కడప వైఎస్‌ఆర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కమలాపురం నియోజ కవర్గానికి సిపిఐ అభ్యర్థిగా గాలి చంద్రకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. రైతులకు సంబంధించిన స్వామినాథ సిఫార్సును అమలు చేస్తామని ఎక్కడ చెప్పలేదు అన్నారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టే విధంగా ఉన్నాయని అన్నారు. ధరలు అరికడతామని కూడా చెప్పలేదన్నారు. అయోధ్య రామున్ని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివద్ధి కోసమే బిజెపితో కలుస్తున్నామని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారని అయితే గతంలో బిజెపి రాష్ట్ర రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, వెనుకబడిన రాయలసీమకు ఇవ్వవలసిన ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని, ఇవన్నీ తెలిసి కూడా మళ్లీ బిజెపితో జతకట్టడం వారి స్వార్ధ రాజకీయాల కోసమేనని తెలిపారు. దేశంలో బిజెపికి బలం లేకపోయినా ఏదో ఒక విధంగా పార్టీల మధ్య చిచ్చు పెట్టి తన ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని చెప్పారు. ఇండియా వేదిక అధికారంలోకి వస్తే మేనిఫెస్టోను అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గ అభ్యర్థి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ, బాదుల్లా, వేణుగోపాల్‌, చంద్రశేఖర్‌, సుబ్రహ్మణ్యం, జిల్లా సమితి సభ్యులు మనోహర్‌ రెడ్డి, వెంకట్రావు పాల్గొన్నారు.ప్రజలను కోరారు. రైతులకు సంబంధించిన స్వామినాథ సిఫార్సును అమలు చేస్తామని ఎక్కడ చెప్పలేదు అన్నారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ఎక్కడ చెప్పలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టే విధంగా ఉన్నాయని అన్నారు. ధరలు అరికడతామని కూడా చెప్పలేదన్నారు. అయోధ్య రామున్ని రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివద్ధి కోసమే బిజెపితో కలుస్తున్నామని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారని అయితే గతంలో బిజెపి రాష్ట్ర రాజధాని నిర్మాణం, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, వెనుకబడిన రాయలసీమకు ఇవ్వవలసిన ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదని, ఇవన్నీ తెలిసి కూడా మళ్లీ బిజెపితో జతకట్టడం వారి స్వార్ధ రాజకీయాల కోసమేనని తెలిపారు. దేశంలో బిజెపికి బలం లేకపోయినా ఏదో ఒక విధంగా పార్టీల మధ్య చిచ్చు పెట్టి తన ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని చెప్పారు. ఇండియా వేదిక అధికారంలోకి వస్తే మేనిఫెస్టోను అమలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గ అభ్యర్థి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకట శివ, బాదుల్లా, వేణుగోపాల్‌, చంద్రశేఖర్‌, సుబ్రహ్మణ్యం, జిల్లా సమితి సభ్యులు మనోహర్‌ రెడ్డి, వెంకట్రావు పాల్గొన్నారు.

➡️