లోకేష్‌ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

Jan 23,2024 15:10 #West Godavari District

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : నారా లోకేష్‌ పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మారావు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమంలో భాగంగా 30 మందికి పైగా దివ్యాంగులకు 25 కేజీలు చొప్పున బియ్యం, దుప్పట్లు అందజేశారు. రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేశారు. రక్తదాన శిబిరాన్ని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి అందరికి పంచారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నారా లోకేష్‌ టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ప్రమాదంలో మతి చెందిన కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం ద్వారా ఆదుకుంటున్నారు అన్నారు.

➡️