మద్దులూరులో బీఎన్‌ ఎన్నికల ప్రచారం

ప్రజాశక్తి-సంతనూతలపాడు మండలంలోని మద్దులూరు గ్రామంలో మంగళవారం రాత్రి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బీఎన్‌ విజరు కుమార్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విజరు కుమార్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు, ఆ పార్టీ మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, నాయకులు నువ్వల మీరయ్య, రావులపల్లి సురేష్‌ బాబు, రంపతోటి అంకారావు, నాగేశ్వరావు, టీ నరసింహారావు, దాసరి రవి, కంకణాల గోపికృష్ణ, మాధవి, ఫణీంద్ర, మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️