ఆదరిస్తే అభివృద్ధి చేస్తా : బిఎన్‌

ప్రజాశక్తి-సంతనూతలపాడు : తనను ఆదరిస్తే పేర్నమిట్ట గ్రామాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని టిడిపి కూటమి సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థి బిఎన్‌.విజరుకుమార్‌ తెలిపారు. మండల పరిధిలోని పేర్నమిట్ట వడ్డెరపాలెంలో టిడిపి నాయకులు తన్నీరు రామారావు, గుంజి రాజు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు జనసేన ఎస్‌ఎన్‌ పాడు నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విజరుకుమార్‌ మాట్లాడుతూ టిడిపి హయాంలోనే బీసీలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసి పేదలకు అందించిన ఘనత టిడిపిదేనని గుర్తు చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, టిడిపి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని తెలిపారు. నిలిచిపోయిన రహదారుల పనులను తిరిగి ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర సెక్రటరీ అడకా స్వాములు, బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యదర్శి తన్నీరు శ్రీనివాసరావు టిడిపి మండల మాజీ అధ్యక్షుడు శిరిపురపు రుద్రయ్య, టిడిపి మండల అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, నాయకులు వివరం గోవిందయ్య, కొట్టే వెంకటేశ్వర్లు, వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి, కరిచేటి శ్రీనివాసరావు, పేర్నమిట్ట శ్రీనివాస్‌, పవన్‌ యువసేన నగర ప్రధాన కార్యదర్శి కందుకూరి వాసు, సంయుక్త కార్యదర్శి ఇంకొల్లు శ్రీమన్నారాయణ, గంగిశెట్టి రాముడు, మేకల పూర్ణచంద్రరావు, డివిజన్‌ అధ్యక్షుడు తిరుమలశెట్టి రాము, చల్లా కృష్ణ, ఇదింపల్లి మధు, కోఆర్డినేటర్‌ కృష్ణమోహన్‌, బిజెపి నాయకుడు దేసు రాంబాబు, టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️